Articles

ప్రత్యర్థుల పతనం

Date: 16th October 2018

నోరు తెరిస్తే అబద్దం ఇంకా ఎన్ని రోజులు నమ్ముతం.
ఇప్పుడు మీకు కొన్ని కారణాలు ఇస్తాను నా ప్రత్యర్థులను ఓడించడానికి…

అప్పు … వీళ్లకి అప్పులు చేయడం తప్ప ఇంకో పని లేదా రాదా తెల్వదా చేతకాదా. అప్పు ఎందుకు చేస్తున్నావ్ అంటే, అమెరికా కు ఎంత అప్పుందో తెలుసా అని అడుగుతే... ఎం అనాలే?! నిన్ను అడిగిన ప్రశ్న ఏంది, నువ్వు చెబుతున్న సమాధానం ఏంది. నీకు చాతనైతదా కాదా, బస్.

మతపరమైన రిజర్వేషన్స్… మన దేశ సమగ్రత, శాంతిభద్రతల ఎట్ల పనిచేస్తాయో వీళ్లకు తెలుసా. మరీ దీనావస్థలో ఉన్న ఒక మతానికి చెందిన వ్యక్తి లాభాలకోసం మతం మారితే దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిసే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా.

పాలన … రాజుల పాలన, దొరల పాలన అంటే విభజించు పాలించు. నిరంతరంగా మనల్ని పుట్టుక ఆధారంగా, కులాల పేరిట విభజించి పాలిస్తారు. కులాల, వర్గాల పేరిట రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నారు. నియంతృత్వ పాలన… ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఎటువంటి అధికారాలు లేకుండా ఏక చక్రాధిపత్యం చలాయిస్తున్నారు.

సభలు … ప్రగతి నివేదన సభ , ఎంత ఖర్చు, ఎంత మందు, ఎంత డీజిల్, ఎందుకొరకు ఈ తాపత్రేయం.

ఒక పక్క ఆదాయం తగ్గుతుంటే, ఇంకో పక్క ఖర్చులు భరించలేకపోతుంటే... వీళ్ళు మనమీద ఇంకా పన్నుల భారం పెంచుకుంటూ పోతున్నారు. ఈ విషవలయం నుండి బయటపడాలంటే ఈ పార్టీల ఉచ్చు నుండి తప్పించు కోవాలంటే మనం పార్టీలకు అతీతంగా సంఘటితం కావాల్సిందే.

పేరుకు జిల్లాలు పెరిగినా సత్తా మాత్రం ఒకరి దగ్గరే కేంద్రీకృతమైవుంది, ఏంది లాభం.

ఖర్చులు … చేయి దాటి పోతుంది మన సమాజం లో జీవించడం, అందుబాటు లో లేకుండా పోతున్న మన జీవితపు ఖర్చులను (Cost of Living) కట్టడి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. వెంటనే అడ్డగోలు అప్పులు ఆపాలి.

ప్రగతి … కేంద్రం ల వికాస్ అన్నారు ఇక్కడ ప్రగతి అన్నారు, పెద్ద తేడా ఏమి లేదు. అక్కడి నుంచి ఆలు కొట్టుకుట్ట వస్తే, ఇక్కడి కెల్లి ఈళ్ళు కొట్టుకుట్ట వచ్చిన్రు. పదాలకు అర్థాలు తెలీక ! ప్రగతి అంటే స్వేచ్ఛ, స్వత్రంత్రం - అప్పు, బానిసత్వం కాదు. ప్రగతి పేరుతో జరుగుతున్న మన వెనుకబాటు పోకడ ఆపాల్సిన బాధ్యత ఇవాళ మనం తీసుకోవాల్సి ఉంది .ప్రజలకు అందుబాటు లో లేని ప్రగతి వల్ల మన దేశం లో మనమే నేడు పనోళ్ళుగా, రైతుల నుంచి రైతు కూలీలుగా కేవలం వలస జీతగాళ్లుగా మారిపోతున్నాం.

ఇదేం ప్రగతి ఇదేం పాలన. సమస్యలు పొంచి ఉన్నపుడు సభలు రద్దు చేసే వారిని మళ్ళి ఎలా ఎన్నుకుంటాం.

ఇక ఓటర్లు … మీ ఓటు ఖరీదు ఎంత? చనిపోతే పూడ్చిపెట్టడానికి కుడా ఆరు అడుగుల స్థలం కావాలి. వారు పంచె చిల్లర నోట్లకు ఒక అడుగు భూమి కుడా కొనలేవు. ఇంకెన్నాళ్లు ఈ అంధకారం లో పడి మగ్గుతాం. ఐదేళ్లు నీ అభిమానం చంపుకోడానికి నీకు ముట్టే సొమ్ముకు నువ్వు కట్టే ఖరీదు నీ పిల్లల భవిష్యత్తు. నోట్లకు ఓట్లు అమ్ముకోవడం మనం నష్ట పోయే ఒప్పదం, దీన్ని మనం తిప్పి కొడదాం.

నిజాన్ని తక్కువ అంచనా వేయకండి, నా పక్షాన నిజం ఉంది.

సమాజమే బలం దేశమే బలం ఐకమత్యమే మహాబలం!
జై హింద్

My Website: www.paree.in
My Email: www.paree.in@gmail.com

Watch the Full Video below.